1 April, 2026 | 3:06 AM

అదుపుతప్పి కారు బోల్తా

01-04-2026 12:00 AM

అలంపూర్ మార్చి 31: అదుపుతప్పి కారు బోల్తా పడిన ఘటన ఉండవల్లి మండ లం 44వ జాతీయ రహదారిపై మంగళవారం చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నంద్యాల వెళ్తున్న కారు ఉండవల్లి శివారులో జాతీయ రహదారిపై అదుపు తప్పి బోల్తా పడింది. కారులో ప్రయాణిస్తున్న ముగ్గురిలో ఇమ్రాన్ కు గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న 108 అంబులెన్స్ సిబ్బంది ఘటన స్థలానికి చేరుకుని చికిత్స అందించినట్లు ఈఏంటి రాధాకృష్ణ,పైలెట్ కృష్ణ తెలిపారు.