వలస కూలీలకు ఆశ్రయంగా మారిన గ్రంథాలయం
- భవనం నిర్మించారు.. పుస్తకాలు ఇవ్వడం మరిచారు
- ఏడాదిన్నరగా ఖాళీగా భవనం
వెంకటాపూర్ (రామప్ప), మార్చి31 (విజయక్రాంతి): విద్యా అభివృద్ధికి కేంద్రంగా ఉండాల్సిన గ్రంథాలయం ప్రారంభించి ఏ డాదిన్నర దాటినా ఇప్పటికీ పుస్తకాల జాడ లేకపోవడం.. గ్రంథాలయం ప్రారంభోత్సవానికి పరిమితమైంది. విజ్ఞానం, విద్యాభివృ ద్ధికి అవసరమైన పుస్తకాలు, సదుపాయాలు కల్పించకపోవడంతో ఖాళీ భవనంగా మిగిలిపోయింది.
చదువుకు ఉపయోగపడాల్సిన ములుగు జిల్లా వెంకటాపురం మండలం పాపయ్యపల్లి గ్రంథాలయం ఇప్పుడు పూ ర్తిగా ఇతర అవసరాలకు వినియోగించబడుతోంది. గ్రంథాలయం ప్రస్తుతం వలస కూ లీలకు ఆశ్రయంగా మారి తన అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోయింది.
ప్రారంభమై ఏడాదిన్నర..పుస్తకాలే లేవు
వెంకటాపూర్ మండలం పాపయ్యపల్లి గ్రామంలో నిర్మించిన గ్రంథాలయం ప్రస్తు తం తన అసలు ఉద్దేశ్యాన్ని కోల్పోయి నిరుపయోగంగా మారింది. గ్రామ యువతకు జ్ఞాన కేంద్రంగా నిలవాల్సిన ఈ గ్రంథాలయం ప్రారంభించి ఏడాదిన్నర దాటినా ఇప్పటికీ ఒక్క పుస్తకం కూడా అందుబాటు లో లేకపోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. గ్రంథాలయం ప్రారంభోత్స వం సమయంలో గ్రామ ప్రజల్లో పెద్దఎత్తున ఆశలు నెలకొన్నాయి.
విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే యువతకు ఇది ఎంతో ఉపయోగపడుతుందని భావించారు.అయి తే ప్రారంభోత్సవం తరువాత అధికారులు పట్టించుకోకపోవడంతో ఈ భవనం క్రమంగా ఖాళీ స్థలంగా మారిపోయింది. పుస్తకాల కోసం ఏర్పాటు చేసిన అలమారాలు ఖాళీగానే ఉండటం ఈ గ్రంథాలయం పరిస్థితిని ప్రతిబింబిస్తోంది.
వలస కూలీలకు ఆశ్రయంగా మారిన గ్రంథాలయం
ప్రస్తుతం ఈ గ్రంథాలయం వలస కూలీలకు నివాసంగా మారడం మరింత ఆందో ళనకర అంశంగా మారింది. పుస్తకాలతో నిండిపోవాల్సిన ప్రదేశంలో వలస కూలీలకు ఆవాసంగా మారింది. ఇది ఒకవైపు ప్రజా ఆస్తి వినియోగంలో లోపాలను చూపుతుండగా, మరోవైపు గ్రంథాలయ ఉద్దేశ్యాన్ని పూర్తిగా నిర్వీర్యం చేస్తోంది.
యువత భవిష్యత్తుపై ఆందోళన
గ్రామాల్లో గ్రంథాలయాలు విద్యార్థులకు మార్గదర్శక కేంద్రాలుగా ఉంటాయి. పాఠశాల విద్యార్థులు, పోటీ పరీక్షల అభ్యర్థులు, యువతకు ఇవి ఎంతో అవసరం. కానీ ఇలాంటి సదుపాయం లేకపోవడం వల్ల పాపయ్యపల్లి గ్రామ యువత చదువుపై దృ ష్టి కోల్పోయే ప్రమాదం ఉందని గ్రామ పెద్దలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సరైన వనరులు, మార్గనిర్దేశం లేకపోతే యువత తప్పు దారులు పట్టే అవకాశాలు ఉన్నాయని వారు హెచ్చరిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
ఈ గ్రంథాలయం ఇలా నిర్లక్ష్యానికి గురవడం బాధాకరమని గ్రామస్థులు పేర్కొంటు న్నారు. అధికారులు తమ బాధ్యతను విస్మరించారని వారు ఆరోపిస్తున్నారు. తక్షణ చర్యలు తీసుకోవాలని ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి గ్రంథాల యాన్ని పుస్తకాలతో నింపి, సక్రమంగా నిర్వహించే చర్యలు తీసుకోవాలని గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
అలాగే ప్రస్తుతం అక్కడ నివసిస్తున్న వలస కూలీలకు ప్రత్యామ్నాయ వసతి కల్పించి, ఈ భవనాన్ని తిరిగి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరుతున్నారు. గ్రామ అభివృద్ధి, యువత భవిష్యత్తు దృష్ట్యా ఈ అంశంపై వెంటనే చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రజలు స్పష్టం చేస్తున్నారు.




