6 May, 2026 | 3:14 AM

సమస్య ఉందని చెప్తే వెంటనే స్పందించాలి

06-05-2026 01:52 AM

ప్రజలకు అధికారులు జవాబుదారిగా ఉండాలి

దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి

మహబూబ్ నగర్, మే 5 (విజయక్రాంతి): ప్రజలు ఎన్నో ఆశలతో ముందుగా అధికారుల దగ్గరికి సమస్యలు పరిష్కరించాలని వస్తారని వెంటనే స్పందించి వారి సమస్యను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకోవాలని దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధు సూదన్ రెడ్డి అన్నారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయం సమావేశం మందిరంలో మంగళవారం దేవరకద్ర నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలపై గ్రామ సర్పంచులు, పంచాయతీ సెక్రెటరీలు, మండల, జిల్లా అధికారులతో దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తాతో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దేవరకద్ర నియో జకవర్గంలోనీ గ్రామాలలో తాగునీటి సమ స్య, గ్రామ అభివృద్ధికి సంబంధించిన  ఇతర సమస్యలపై సర్పంచులు అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.

ముఖ్యంగా త్రాగునీటి సమస్యల  సత్వర పరిష్కారానికి  జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మిషన్ భగీరథ అధికారులకు ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  జి.మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు ప్రభుత్వ అధికారులతో నేరుగా మాట్లాడి గ్రామాలలో సమస్యలను పరిష్కరించుకునే వేదికగా ఈ సమీక్ష సమావేశం నిర్వహించామని తెలిపారు.

ఈ సందర్భంగా తాగునీరు, విద్యుత్ సమస్యలు, ఇందిరమ్మ ఇళ్లు, డ్రైనేజ్ పనులు, సి.సి రోడ్లు, పాఠశాలలకు కాంపౌండ్ గోదాడలు, గ్రామ పంచాయతీ, అంగన్వాడీ భవనాలు, పింఛన్ల పంపిణీ, వంటి పలు ముఖ్య అంశాలపై విస్తృతంగా చర్చించారు. సమావేశంలో భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్, రెవెన్యూ అదనపు కలెక్టర్ జె.ఎల్.బి. హరిప్రియ, భూత్పూర్ మున్సిపల్ చైర్మన్ బాలకోటి, దేవరకద్ర మున్సిపల్ చైర్ పర్సన్ దమయంతి గోవర్ధన్ రెడ్డి, దేవరకద్ర మార్కెట్ కమిటీ చైర్మన్ కథలప్ప, గ్రామ సర్పంచులు, అధికారులు ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.