10 March, 2026 | 11:32 PM

మైనర్లకు తల్లితండ్రులు వాహనాలు ఇస్తే చర్యలు తప్పవు

10-03-2026 09:44 PM

- మైనరులు వాహనాలు నడపడం చట్ట విరుద్ధం 

- విద్యార్థులకు కౌన్సెలింగ్ 

- రోడ్డు భద్రతపై అవగాహన కల్పించిన ఎస్సై బి. మహేష్

ఏటూరునాగారం,(విజయక్రాంతి): మైనర్ విద్యార్థులు వాహనాలు నడపకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తూ ఏటూరునాగారం పోలీసులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వాహనాలు నడుపుతున్న మైనర్ విద్యార్థులకు ఎస్సై మహేష్ కౌన్సెలింగ్ నిర్వహించారు పరీక్షల సమయాల్లో విద్యార్థులు తొందరలో వాహనాలు నడపడం వల్ల రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని ఆయన తెలిపారు.

18సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు వాహనాలు నడపడం చట్ట విరుద్ధమని, తల్లిదండ్రులు తమ పిల్లలకు వాహనాలు ఇవ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పోలీసులు విద్యార్థుల భద్రత కోసమే ఈ తనిఖీలు నిర్వహిస్తున్నారని, శిక్షల కంటే ముందుగా అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని, వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్ ధరించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని విద్యార్థులకు వివరించారు.ఈ కార్యక్రమంలో చంద్ర మోహన్.గోపీ.పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.