నర్సింగ్ కళాశాలలో కోతుల పట్టివేత
16-06-2026 05:15 PM
నిర్మల్(విజయక్రాంతి): నిర్మల్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో మంగళవారం మున్సిపల్ అధికారులు కోతుల పట్టివేత నిర్వహించారు. కళాశాలకు వస్తున్న విద్యార్థులపై కోతులు ప్రతిరోజు దాడి చేసి భయభ్రాంతులకు గురి చేయడంతో విద్యార్థులు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్ చక్రవర్తి ఆదేశాల మేరకు కళాశాల ఆవరణలో ఉన్న 100 కోతులను పట్టుకొని జన్నారం అడుగులకు తరలించినట్లు ఇన్స్పెక్టర్ ప్రవీణ్ స్థానిక కౌన్సిలర్ సుమాలత రాఘవేంద్ర చారి తెలిపారు.






