మాజీ కార్పొరేటర్ సురేష్ అందించిన సేవలు చిరస్మరణం
ఉప్పల్,(విజయక్రాంతి): నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ అందించిన సేవలు చిరస్మరణీయమని మల్లాపూర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ అన్నారు. 56వ జన్మదిన సందర్భంగా మల్లాపూర్ లోని స్వామి వివేకానంద నగర్ కాలనీలో ఉన్న ఆయన విగ్రహం వద్ద కాంగ్రెస్ నాయకులు జయంతి వేడుకలను నిర్వహించారు. విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా అనిల్ మాట్లాడుతూ ప్రజల కష్టం సుఖాలో అండగా నిలిచి అందరు మనలు పొందిన సురేష్ ఆశయాలకు నేటి తరానికి ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. పదవుల శాశ్వతం కావు కానీ ప్రజల కోసం చేసిన సేవే శాశ్వతంగా ప్రజల హృదయాల్లో నిలిచిపోతుందని అనిల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నెమలి రవికుమార్ వీరస్వామి నెమలి శ్రావన్ పి ఆర్ మోహన్ సూర్యచంద్ర యూత్ క్లబ్ సభ్యులు అభిమానులు పాల్గొన్నారు.






