చెట్టు కొమ్మలు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి
గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టే లలిత
భద్రాచలం (విజయ క్రాంతి): భద్రాచలం బస్ స్టాండ్ ఎదురుగా ఉన్న హోటల్ యాజమాన్యం గ్రీన్ భద్రాద్రి సంస్థ భద్రాచలం పట్టణం ప్రధాన రహదారిపై పెంచిన చెట్టును హోటల్ యాజమాన్యం నరికి వేయటానికి గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టి లలిత తీవ్రంగా ఖండించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ గ్రీన్ భద్రాద్రి ఆధ్వర్యంలో ప్రతి ఏడాది లక్షల రూపాయలు ఖర్చు చేసి భద్రాచలం గ్రీన్ భద్రాద్రిగా రూపొందించడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. కొంతమంది తమ స్వార్థం కోసం చెట్లను నరికి వేయటం దారుణమని ఆమె కోరుకుంటూ చెట్లు నరికిన హోటల్ యాజమాన్యం పై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. భద్రాచలం పట్టణంలో భవిష్యత్ లో ఇలాంటి దుశ్చర్యలు జరగకుండా చూడాలని గ్రీన్ భద్రాద్రి అధ్యక్షురాలు చిట్టి లలిత గ్రామపంచాయతీ అధికారులను రెవెన్యూ, ఫారెస్ట్ అధికారులను కోరారు.






