16 June, 2026 | 7:10 PM

మెజిస్ట్రేట్ శివ నాయక్ జన్మదిన వేడుకలు

16-06-2026 06:09 PM

​భద్రాచలం,(విజయక్రాంతి): భద్రాచలం జ్యూడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ శివనాయక్ జన్మదిన వేడుకలు మంగళవారం భద్రాచలం కోర్టు ఆవరణలో వేద పండితుల ఆశీర్వచనంతో  ఘనంగా జరిగాయి. ​ఈ సందర్భంగా కోర్టు ఆవరణలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కేక్ కటింగ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ దుర్గాభవాని, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్  శ్రీధర్, బార్ అసోసియేషన్ అధ్యక్షులు కొడాలి శ్రీనివాసన్, ప్రధాన కార్యదర్శి పూసాల శ్రీనివాసా చారి, జాయింట్ సెక్రెటరీ తాతా లలిత, కోశాధికారి దన్నాన రాము,లేడీ రిప్రజెంటేటివ్ ఎం తరుణి, పోలీస్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొని న్యాయమూర్తి గారికి ఆత్మీయ జన్మదిన అభినందనలు మరియు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.