16 June, 2026 | 6:49 PM

మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యేగా మెచ్చా రావాలి

16-06-2026 05:51 PM

ప్రత్యేక పూజలు నిర్వహించిన బిఆర్ఎస్ నాయకులు

దమ్మపేట,(విజయక్రాంతి): అశ్వారావుపేట  నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ మెచ్చా నాగేశ్వరరావు పుట్టినరోజు సందర్భంగా దమ్మపేట మండల కేంద్రంలోని శ్రీ మర్రి భక్తాంజనేయ స్వామి వారి ఆలయంలో మెచ్చా నాగేశ్వరరావు ఆయురారోగ్యాలతో ఉండాలని, రాష్ట్రానికి కెసిఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని, మెచ్చా నాగేశ్వరరావు అశ్వారావుపేట నియోజకవర్గ ఎమ్మెల్యే కావాలని బిఆర్ఎస్ నాయకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఫ్రూట్స్, బ్రెడ్ లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మండల అధ్యక్షులు దొడ్డా రమేష్, పార్కలగండి సర్పంచ్ కొమరం సుశీల, మాజీ వైస్ ఎంపీపీ దారా మల్లిఖార్జునరావు, మండల ఉపాధ్యక్షులు గాజుబోయిన యేసు బాబు, దారా యుగంధర్, జలగం వాసు, తుమ్మల లక్ష్మణ్ రావు, సోయ్యం రాజ బాబు, విష్ణు, సురేష్ తదితరులు ఉన్నారు.