యోగాతోనే సంపూర్ణ... ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయి
మాజీమంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి
జవహర్ నగర్,(విజయక్రాంతి): యోగాతోనే సంపూర్ణ ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని ప్రతి ఒక్కరు యోగ జీవితంలో భాగస్వామ్యం చేసుకోవాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పిలుపునిచ్చారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకొని జవహర్ నగర్ మాజీ మేయర్ మేకల కావ్య, జవహర్ నగర్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కొండల ముదిరాజ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డిని యోగ ఆశ్రమ నిర్వాహకులు శంకరాచార్య సమక్షంలో మంగళవారం ఆహ్వాన పత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ ఆధునిక కాలంలో రకరకాల రోగాలు పడి చిన్న వయసులోనే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారని యోగా చేస్తే రోగాలు దరి చేరవని అన్నారు. వయస్సుతో భేదాభిప్రాయం లేకుండా ఆసనాలు చేయవచ్చని యోగ మనిషి మానసిక స్థితిని అదుపులోకి తెస్తుందని సూర్య నమస్కారాలు చాలా శ్రేష్టమైనవి అని తెలిపారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని విజయవంతం చేద్దామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నరసయ్య యాదవ్, పద్మారావు, శ్రీనివాస్, వీరాచారి, నితిన్ పాల్గొన్నారు.






