16 June, 2026 | 6:15 PM

Breaking News

మాజీ కార్పొరేటర్ సురేష్ అందించిన సేవలు చిరస్మరణం   •   చెట్టు కొమ్మలు నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి   •   మెజిస్ట్రేట్ శివ నాయక్ జన్మదిన వేడుకలు   •   జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపుపై హర్షం   •   ఎరువుల వేటలో గిరిజనేత రైతులు   •   మళ్ళీ ముఖ్యమంత్రిగా కేసీఆర్, ఎమ్మెల్యేగా మెచ్చా రావాలి   •   సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర 2026 షెడ్యూల్   •   పిర్జాదిగూడ, మేడిపల్లి ప్ర‌భుత్వ పాఠశాలలకు బీఆర్ఎస్ నాయకుల అండ‌   •   తెలంగాణవ్యాప్తంగా 'ఈగల్ ఫోర్స్' ఆపరేషన్.. 14 మందికి డ్రగ్ పాజిటివ్   •   శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు   •  

సీఐ అశోక్ రెడ్డి సేవలు అభినందనీయం.. దోసపాటి పిచ్చేశ్వరరావు

16-06-2026 05:17 PM

అశ్వాపురం, (విజయక్రాంతి): అశ్వాపురం మండలంలో రెండేళ్లకు పైగా సీఐగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న సీఐ అశోక్ రెడ్డిని దోసపాటి రంగారావు చారిటబుల్ ట్రస్ట్ డైరెక్టర్, శివకామేశ్వరీ గ్రూప్స్ డైరెక్టర్ దోసపాటి పిచ్చేశ్వరరావు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విధి నిర్వహణలో అశోక్ రెడ్డి అందించిన సేవలు అభినందనీయమని, మండలంలోని అన్ని వర్గాల ప్రజలతో సత్సంబంధాలు నెలకొల్పి ప్రజల మన్ననలు పొందారని కొనియాడారు. కొత్త బాధ్యతల్లో మరింత ఉన్నత స్థానాలను అధిరోహించి ఆయురారోగ్యాలతో ఉండాలని భద్రాద్రి శ్రీరాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. తన విధి నిర్వహణలో దోసపాటి పిచ్చేశ్వరరావు అందించిన సహకారానికి సీఐ అశోక్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.