16 June, 2026 | 7:10 PM

జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల గడువు పొడిగింపుపై హర్షం

16-06-2026 06:05 PM

- తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు యాకూబ్ పాషా

కొత్తగూడెం,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్రంలోని జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డుల గడువును 2026 జూలై 15 వరకు పొడిగిస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల యూనియన్ జిల్లా అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా మంగళవారం ఒక ప్రకటనలో హర్షం వ్యక్తం చేశారు.జర్నలిస్టుల హక్కులు,సంక్షేమం,వృత్తిపరమైన బాధ్యతల నిర్వహణకు అక్రిడిటేషన్ కార్డులు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు. హైకోర్టు తాజా నిర్ణయం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులకు తాత్కాలిక ఉపశమనం కల్పించిందన్నారు.

ఈ సందర్భంగా తెలంగాణ ఉర్దూ వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్ చేపట్టిన న్యాయపోరాటాన్ని ఆయన అభినందించారు. జర్నలిస్టుల ప్రయోజనాల పరిరక్షణ కోసం ఫెడరేషన్ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు.అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపుతో జర్నలిస్టులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా తమ విధులను కొనసాగించగలరని, ప్రభుత్వ కార్యక్రమాలు,అధికారిక సమావేశాలకు హాజరయ్యే అవకాశాలు కొనసాగుతాయని యాకూబ్ పాషా పేర్కొన్నారు.

అయితే ఇది తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని, అక్రిడిటేషన్ వ్యవస్థకు సంబంధించి శాశ్వత పరిష్కారం కోసం న్యాయపరమైన పోరాటం కొనసాగించాలని ఆయన అభిప్రాయపడ్డారు.జర్నలిస్టుల హక్కులను కాపాడే విధంగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాలు తీసుకోవాలని కోరారు.హైకోర్టు నిర్ణయాన్ని స్వాగతిస్తూ ఈ వ్యవహారంలో సహకరించిన న్యాయవాదులు, ఫెడరేషన్ నాయకత్వానికి యాకూబ్ పాషా కృతజ్ఞతలు తెలిపారు.