26 February, 2026 | 4:40 AM

కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కమిటీ ఎన్నిక

26-02-2026 12:57 AM

కుషాయిగూడ ఫిబ్రవరి 25 (విజయక్రాంతి): కాప్రా టీఎస్‌ఐఐసీ కాలనీలోని ప్రెస్ క్లబ్ కార్యాలయంలో బుధవారం జరిగిన సమావేశంలో కాప్రా ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సలహాదారులుగా ఎంపల్లి పద్మారెడ్డి, బెలిడే అశోక్ ఎన్నికయ్యారు. అధ్యక్షుడిగా మెరుగు చంద్ర మోహన్, ఉపాధ్యక్షులుగా దిలీప్ కుమార్, యావాపురం రవి, దొమ్మటి కిరణ్ కుమార్, గార్లపాటి శ్రీనివాస్ రావు ఎంపికయ్యారు.

ప్రధాన కార్యదర్శిగా ముత్యం ముకేష్ గౌడ్ ఎన్నికయ్యారు. కార్యదర్శులుగా డి. శ్రీనివాస్, కె. వెంకట్, వ్యవస్థాపక కార్యదర్శులుగా ఓ. నరసింహ, కీర్తి శ్రీనివాస్ ఎంపికయ్యారు. ఖజానాదారుడిగా రామచంద్ర మూర్తి ఎన్నికయ్యాడు. కార్యవర్గ సభ్యులుగా గంగి కృష్ణ, గోవిందు కుంట్ల ఆంజనేయులు, బుడంపల్లి నిరంత్ గౌడ్, తొడుపునూరు బాలకృష్ణలను ఎన్నుకున్నారు.

ఈ సందర్భంగా అధ్యక్షుడు మెరుగు చంద్ర మోహన్, ప్రధాన కార్యదర్శి ముత్యం ముకేష్ గౌడ్, ఖజానాదారు రామచంద్ర మూర్తి మాట్లాడుతూ కాప్రా ప్రెస్ క్లబ్కు చెందిన జర్నలిస్టుల సంక్షేమం, వృత్తి అభివృద్ధి కోసం కృషి చేస్తామని తెలిపారు. సభ్యుల విశ్వాసానికి కృతజ్ఞతలు తెలుపుతూ త్వరలోనే కొత్త సభ్యత్వాలు జారీ చేస్తామని ప్రకటించారు. సీనియర్ జర్నలిస్టులు పల్లూ పవన్, నర్రా శ్రీనివాస్ రెడ్డి, విజయ్, వెంకటాపురం రవి, రియాజ్, చిట్టారి, ఫోటో జర్నలిస్టు మొహమ్మద్ గౌస్ తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.