13వ వార్డులో ప్రతి ఓటర్ వద్దకు సర్ ఫారాలు అందజేత
10-07-2026 07:50 PM
బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని 13వ వార్డు టీచర్స్ కాలనీలో రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు సర్ ఎన్యుమరేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఓటర్ వద్దకు ఎన్యుమరేషన్ ఫారాలు, ఓటర్ నమోదు పత్రాలను మున్సిపల్ కౌన్సిలర్ ఖాలేక్, కో ఆప్షన్ సభ్యులు ఖమర్ సుల్తానా గౌస్ బూతు నెంబర్ 227 228 లలో ఓటర్లకు సర్ ప్రక్రియను ఓటర్ నమోదు ప్రక్రియను అవగాహన కల్పించారు. స్వయంగా ఓటర్ నమోదును నమోదు చేశారు. ఓటర్ నమోదైన పత్రాలను స్వీకరించడం జరిగినట్లు ఆయన తెలిపారు.వ్యవసాయ సలహాదారులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ఆగ్రో చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డి సి సి బి చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి లు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని గౌస్ తెలిపారు.






