calender_icon.png 15 February, 2026 | 3:22 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పుల్వామా వీరులు.. ప్రాతః స్మరణీయులు

15-02-2026 12:00:00 AM

టీఆర్పీ రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా 

పార్టీ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ 

కరీంనగర్, ఫిబ్రవరి 14(విజయక్రాంతి): 2019 ఫిబ్రవరి 14 వినగానే ప్రతి భారతీయుల రక్తం ఉడుకుతుంది. ఆ రోజు జమ్మూ- శ్రీనగర్ జాతీయ రహదారిపై పుల్వామా జిల్లాలో జైషే-మహ్మద్ ఉగ్రవాదులు జరిపిన ఆత్మాహుతి దాడిలో 40 మంది మన దేశ వీర జవాన్లు (సీఆర్పీఎఫ్) అమరులైన వారి కి కరీంనగర్ జిల్లా తెలంగాణ రాజ్యాధికార పార్టీ(టీఆర్పీ) జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శి అఖిల్ పాషా కొవ్వొ త్తులతో జిల్లా కేంద్రంలో ఉద్యోగ విరమణ పొందిన ఆర్మీ జవాన్లతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించారు.

అనంతరం మీడియాతో అఖిల్ పాషా మాట్లాడు తూ ప్రతి రోజు దేశవ్యాప్తంగా మనం ఇంట్లో హాయిగా నిద్రపోతున్నామంటే, దానికి కారణం సరిహద్దుల్లో కాపలా కాసే సైనికులేనని గుర్తుచేశారు. వారు తమ ప్రాణాలను ఫణంగా పెట్టి దేశ ప్రజల ప్రాణాల్ని సురక్షితంగా కాపాడుతున్నారని అన్నారు. పుల్వా మాలో అమరులైన జవాన్ల త్యాగం వృథా పోదు.

ఆ ఘటన మన దేశాన్ని మరింత ఏకం చేసిందన్నారు. అనంతరం ఒక నిమిషం పాటు మౌనం పాటించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గంగిపెళ్లి అరుణ, రిటైర్డ్ ఆర్మీ జవాన్లు సయ్యద్ షాహిద్ హుస్సేన్, సత్యనారాయణ రెడ్డి, ఎస్వీ బాబు, బాలయ్య, ఎండీ శన్నా, టీఆర్పీ పార్టీ జిల్లా , మండల, టౌన్ నాయకులు ఎండి వాజిద్, చాంద్ పాషా, రాకేష్, ఎగుర్ల రమేష్, అంకుశవలి, ఇశ్రాత్ శావాలి, జింక లావణ్య, భోగ భాస్కర్, ఓర్సు రాజు, చిగుర్ల మోహన్, శేఖర్, విమల, చిత్ర, మంగ, మహబూబ్ అలీ, గణేష్ తదితరులు పాల్గొన్నారు.