28 March, 2026 | 3:58 AM

ముందస్తు గుర్తింపుతోనే క్యాన్సర్ నివారణ సాధ్యం

28-03-2026 02:14 AM

నిమ్స్ డైరెక్టర్ నగరి బీరప్ప

పంజాగుట్ట, మార్చి 27 (విజయక్రాంతి): రాష్ట్రంలో వేగంగా విస్తరిస్తున్న క్యాన్సర్ వ్యాధిపై ప్రజల్లో అవగాహన పెంచడంతో పాటు సమగ్ర నివారణ చర్య లు చేపట్టడం తక్షణ అవసరమని నిమ్స్ డైరెక్టర్ డాక్టర్ బీరప్ప పిలుపునిచ్చా రు. నిమ్స్ ఆసుపత్రిలో శుక్రవారం నిర్వహించిన కీలక సమావేశంలో ఆయన మాట్లా డుతూ పెరుగుతున్న క్యాన్సర్ కేసుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.

ఈ మహమ్మారిని ఎదుర్కోవడానికి ముందస్తు గుర్తింపు, నిరంతర స్క్రీనింగ్, సామాన్యులకు అందుబాటులో ఉండే చికిత్సా సౌక ర్యాలు అత్యంత కీలకమని ఆయన స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో నిమ్స్ రిజిస్ట్రార్ డాక్టర్ శాంతవీర్ ఉప్పీన్, ఎంఎన్జే ఆసుపత్రి ప్రొఫెసర్ డాక్టర్ రఘునాథరావుతో పాటు పలువురు సీనియర్ వైద్యులు, పరిశోధకులు తదితరులు పాల్గొన్నారు.