లివింగ్ రిలేషన్‌లో మోసం
- పిర్యాదు చేసిన పట్టించుకోని పోలీసులు
- రూ.30 లక్షలు తీసుకొని మొఖం చాటేశాడని మహిళ ఆవేదన
ఖైరతాబాద్,మార్చి27(విజయక్రాంతి): లీవింగ్ రిలేషన్లో ఉన్న వ్యక్తి తనను మోసం చేసి రూ.30 లక్షలు తీసుకుని, ప్రాణహానికి యత్నిస్తున్నాడని మణికొండకు చెందిన స్వాతి అనే మహిళ ఆరోపణలు చేశారు.ఈ ఘటనపై పోలీసుల వద్ద ఫిర్యాదు చేసినప్పటికీ సరైన చర్యలు తీసుకోకుండా నిందితు లకు వత్తాసు పలుకుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
శుక్రవారం సోమాజి గూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో స్వాతి తన సమస్యలను వివరించారు. విజయనగరం జిల్లాకు చెందిన బొబ్బిలి సాయికిరణ్ అనే వ్యక్తి గత రెండేళ్లుగా తనతో లీవింగ్ రిలేషన్లో ఉండి, తన వద్ద నుండి రూ.30 లక్షలు తీసుకున్నాడని తెలిపారు. అనంతరం తనను హత్య చేయడానికి ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.
ఈ విషయమై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినప్పటికీ, అక్కడి ఇన్స్పెక్టర్ నిందితుడికి మద్దతుగా వ్యవహరిస్తూ తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని స్వాతి పేర్కొన్నారు. మహిళలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు అక్రమార్కులకు అండగా నిలవడం విచారకరమన్నారు.
అలాగే, రాజ కీయ ప్రభావంతో కేసును తప్పుదోవ పట్టిం చే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపి స్తూ, సంబంధిత పోలీసు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర పోలీస్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు వెంటనే స్పందించి తనకు న్యాయం చేయాలని ఆమె విజ్ఞప్తి చేశారు.




