138 కోట్ల లావాదేవీల గుట్టురట్టు
- ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0లో భాగంగా విస్తృత దర్యాప్తు
వెలుగు చూసిన భారీ సైబర్ మోసం
ఆర్బీఎల్ వర్చువల్ ఖాతాల ద్వారా మళ్లింపు
మొత్తం 24 మంది నిందితుల్లో గాను 13 మంది అరెస్ట్ చేసిన పోలీసులు
కరీంనగర్, మార్చి27(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో సైబర్ నేరాలపై పోలీసులు ఉక్కుపాదం మో పారు. ఆపరేషన్ క్రాక్‌డౌన్ 1.0లో భాగంగా నిర్వహించిన విస్తృత దర్యాప్తులో మ్యూల్ బ్యాంక్ ఖాతాల ద్వారా కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు నిర్వహిస్తున్న భారీ సైబర్ ముఠాను గుర్తించారు.మొత్తం 24 మంది ఈ స్కామ్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
అందులో 13 మందిని శనివా రం అరెస్ట్ చేశారు. ఈ ముఠా ద్వారా సు మారు రూ.138 కోట్ల భారీ లావాదేవీలు జరిగినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ముఖ్యంగా రత్నాకర్ బ్యాంక్ (ఆర్బీఎల్) వర్చువల్ ఖాతాల ద్వారా ఈ అక్రమ లావాదేవీలు కొనసాగినట్లు అధికారులు తెలిపా రు. పోలీసులు మొత్తం ఎనిమిది కేసులు నమోదు చేశారు. రత్నాకర్ బ్యాంక్ (ఆర్బీఎల్), రాపిడ్ గ్రో వర్చువల్ ఖాతాల ద్వారా ఈ మోసాలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు.
దర్యాప్తులో నిందితులు అత్యంత ప్రణాళికాబద్ధంగా పని చేసినట్లు తేలింది. సమన్వయకర్తలు మ్యూల్ ఖాతాల ఏర్పాటును పర్యవేక్షించగా, మధ్యవర్తులు అమా యక ప్రజలను డబ్బు ఆశ చూపించి వారి పేర్లతో బ్యాంక్ ఖాతాలు తెరిపించారు. ఖా తాదారులు తమ వ్యక్తిగత ఖాతాలను నేరగాళ్లకు అప్పగించి, వాటి ద్వారా సైబర్ మోసా ల సొమ్మును విదేశాలకు మళ్లించినట్లు పోలీసులు వెల్లడించారు.
అరెస్ట్ చేసిన నిందితుల వివరాలిలా ఉన్నాయి: బండారి సాయిరాం (30) వెల్గటూర్, జగిత్యాల; అనుమాండ్ల రంజిత్ (36) గోపులాపూర్, బుగ్గారం, జగిత్యాల; అలిగేటి మల్లేశం (37) ధర్మారం, పెద్దపల్లి; బోగ రాకేష్ (35) జగిత్యాల; బండి ప్రణయ్ (25) వెదిరె,రామడుగు, కరీంనగర్. బ్యాంకు అధికారుల్లో భువనగిరి కళ్యాణ్ (52) హన్మకొండ,. ఆర్బీఎల్ బ్యాంక్ మేనేజర్; అయేషా బేగం (30) కరీంనగర్.
ఖాతా దారుల్లో విభూది రాంకుమార్ (37) ధర్మా రం, పెద్దపల్లి;నతర్ల శ్రీనివాస్ (39) లక్ష్మిపూర్, జగిత్యాల; కర్రే రాజు (35) వరంగల్; కల్లెడ మహేందర్ (36) జగిత్యాల; కొండ్ర నరహరి (37) జగిత్యాల; కల్లెడ రాజేష్ (27) జగిత్యాల ఉన్నారు.పోలీసుల ప్రాథమిక విచారణలో వర్చువల్ ఖాతాల ద్వారా రు‘ 12,25,31,665, అలాగే ఆర్బీఎల్ బ్యాంక్ మ్యూల్ ఖాతాల ద్వారా రు 125,80,71,688 లావాదేవీలు జరిగినట్లు బయటపడింది. మొత్తంగా సుమారు ౧38 కోట్ల రూపాయల మేర ఈ అక్రమ లావాదేవీలు జరిగినట్లు నిర్ధారించారు.




