రికార్డు స్థాయిలో ఫ్యాన్స్
30-06-2026 12:22 AM
న్యూయార్క్, జూన్ 29: అమెరికా, కెనడా, మెక్సికో దేశాల సంయుక్త ఆధ్వర్యంలో జరుగుతున్న సాకర్ ప్రపంచకప్ 2026 సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. టోర్నీ గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లను వీక్షించేందుకు ప్రపంచవ్యాప్తంగా రికార్డు స్థాయిలో అభిమానులు తరలివచ్చారు.
కేవలం గ్రూప్ స్టేజ్ మ్యాచ్‌లకే రికార్డు స్థాయిలో 46 లక్షలకు పైగా మంది అభిమానులు స్టేడియాలకు హాజరైనట్లు అంతర్జాతీయ ఫుట్‌బాల్ సమాఖ్య అధికారికంగా ప్రకటించింది. ఫుట్‌బాల్ చరిత్రలోనే ఇదివరకు ఎన్నడూ లేనంత మంది ప్రేక్షకులు ఈ లీగ్ మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించారని ఫిఫా వెల్లడించింది. ఫిఫా ప్రపంచకప్ సాధిస్తున్న అపూర్వ విజయంపై అమెరికా అధ్య క్షుడు ట్రంప్ హర్షం వ్యక్తం చేశారు.






