నోటీసులు అందుకున్న ఓటర్లకు ఓటు హక్కుపై అవగాహన
30-08-2026 02:21 PM
మల్కాజిగిరి, ఆగస్టు 30,(విజయక్రాంతి): ఎస్ఐఆర్ ప్రక్రియ 2వ దశలో భాగంగా నోటీసులు జారీ చేశారు. ఈ సందర్భంగా నోటీసులు అందుకున్న వారికి శుక్రవారం కాంగ్రెస్ పార్టీ వినాయక్ నగర్ డివిజన్ అధ్యక్షుడు పిట్టల నాగరాజు అవగాహన కల్పించారు. బిఎల్ ఓ లు, కాంగ్రెస్ పార్టీ బీఎల్ ఏ లు సమన్వయంతో పని చేసి, అర్హులైన ఓటర్లను గుర్తించి, వారి ఓట్లు తొలగించకుండా తగిన చర్యలు తీసుకోవాల ని ఆయన సూచించారు.






