30 August, 2026 | 3:18 PM

బండి సంజయ్ తో కలిసి మన్ కీ బాత్ వీక్షణ

30-08-2026 02:01 PM

ముకరంపుర, ఆగస్టు 30 (విజయక్రాంతి): ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన 137వ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్' మనసులోని మాట ప్రసంగాన్ని కరీంనగర్ లోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ నివాసంలో ఆసక్తిగా వీక్షించారు. ఆదివారం ఉదయం కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ గృహంలో ఏర్పాటు చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమంలో కరీంనగర్ నగరపాలక సంస్థ మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్, యాదగిరి సునీల్ రావు మరియు బీజేపీ జిల్లా అధ్యక్షులు సాయిని మల్లేశం, మాజీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులు, తదితరులు ప్రధాని ప్రసంగాన్ని ఆసాంతం వీక్షించారు.