ఉద్యోగాల కోసం ఎదురుచూపులొద్దు..స్వయం ఉపాధిలో రాణించాలి
బావుసాయిపేటలో ఓంకార్ నాన్‌వెజ్ కర్రీ పాయింట్ ప్రారంభం
కోనరావుపేట, ఆగస్టు 30 (విజయక్రాంతి): ఉద్యోగాల కోసం ఎదురు చూస్తూ కాలం వృథా చేసుకోకుండా యువత సొంత వ్యాపారాలు ప్రారంభించి స్వయం ఉపాధి మార్గంలో ముందుకు సాగాలని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ ఫిరోజ్ పాషా పిలుపునిచ్చారు. కోనరావుపేట మండలం బావుసాయిపేట గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఓంకార్ నాన్‌వెజ్ కర్రీ పాయింట్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కర్రీ పాయింట్ నిర్వాహకుడు జంగం సంజీవ్‌ను అభినందించి, వ్యాపారంలో మరింత ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నేటి యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడటమే కాకుండా, తమలోని ప్రతిభను గుర్తించి సొంతంగా వ్యాపారాలు ప్రారంభించడం ద్వారా ఆర్థికంగా ఎదగాలని సూచించారు.
కష్టాన్ని నమ్ముకుని పట్టుదలతో ముందుకు సాగితే విజయాలు తప్పకుండా సాధించవచ్చని అన్నారు.యువత మంచి మార్గంలో నడుస్తూ స్వయం ఉపాధిని ఎంచుకుని తమతో పాటు మరికొందరికి ఉపాధి అవకాశాలు కల్పించే స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.గ్రామాల్లో స్థానికంగా వ్యాపారాలు అభివృద్ధి చెందడం ద్వారా ఆర్థిక లావాదేవీలు పెరగడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు మరింత విస్తరిస్తాయని షేక్ ఫిరోజ్ పాషా పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు దేవయ్య, నాయకులు బైరగోని నందు గౌడ్, ఎక్కలదేవి శ్రీనివాస్, జంగం దయాకర్, ప్రభాకర్, పద్మారావు, సునీల్ తదితరులు పాల్గొన్నారు.






