పేదలకు అండగా ప్రజాప్రభుత్వం ఖానాపూర్ ఎమ్మెల్యే
30-08-2026 01:56 PM
4 లక్షల రూపాయల LOC అందించిన వెడ్మ బొజ్జు పటేల్...
ఉట్నూర్,ఆగస్టు 30, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా జన్నారం మండలం కవ్వాల్ గ్రామానికి చెందిన దుర్గం లింగారెడ్డి గారు అనారోగ్యంతో బాధపడుతూ శస్త్రచికిత్స అవసరమైన పరిస్థితిలో ఉన్నారు. హైదరాబాద్‌లోని NIMS ఆసుపత్రి వైద్యులు శస్త్రచికిత్సకు సుమారు రూ.4 లక్షలు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. నిరుపేద కుటుంబానికి చెందిన లింగారెడ్డి గారి పరిస్థితిని తెలుసుకున్న ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ చికిత్సకు అవసరమైన రూ.4 లక్షల మొత్తానికి CMRF ద్వారా LOC మంజూరు చేయించేలా చొరవ తీసుకున్నారు. పేదల వైద్య అవసరాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న కుటుంబాలకు భరోసా కల్పిస్తున్న ఎమ్మెల్యే చొరవపై లింగారెడ్డి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.






