30 August, 2026 | 3:50 PM

మరో భూ కుంభకోణం..! సీఎం రేవంత్ రెడ్డికి హరీశ్ రావు లేఖ

30-08-2026 02:44 PM

రేవంత్ రెడ్డి సర్కార్ రియల్ ఎస్టేట్ ఏజెన్సీ

రూ. 500 కోట్ల భూమిని.. 87 కోట్లకే ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం.

ప్రభుత్వ భూములను ధారాదత్తం చేయడం ఆపాలి

హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(CM Revanth Reddy) మాజీ మంత్రి హరీశ్ రావు(Thanneeru Harish Rao) లేఖ రాశారు. ప్రభుత్వ భూములను(Government lands) ధారాదత్తం చేయడం ఆపాలని లేఖలో డిమాండ్ చేశారు. అజామాబాద్ లో ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. రూ. 500 కోట్ల భూమిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేస్తున్నారని పేర్కొన్నారు. రూ. 500 కోట్లు విలువైన భూమిని.. 87 కోట్లకే కట్టబెడుతున్నారని మండిపడ్డారు. రూ. 87 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్(Government agency Oil Fed) సిద్ధంగా ఉందని ఆయన సూచించారు. భూమి కొనుగోలుకు ఆయిల్ ఫెడ్ సిద్ధంగా ఉన్నా.. ప్రైవేట్ వ్యక్తులకే ఇస్తున్నారని విమర్శించారు. రేవంత్ సర్కార్(Revanth Reddy's government) రియల్ ఎస్టేట్ ఏజెన్సీగా(Real Estate Agency) మారిపోయిందని  హరీశ్ రావు వ్యాఖ్యానించారు.