15 May, 2026 | 4:06 AM

మండల పరిషత్ స్కూల్‌కు కెన్ ఫిన్ హోమ్స్ సాయం

15-05-2026 01:14 AM

రూ.11.65 లక్షలతో మరుగుదొడ్లు, ఆరో వాటర్ ప్లాంట్ ఏర్పాటు

హైదరాబాద్, మే 14 (విజయక్రాంతి): కెన్ ఫిన్ హోమ్స్ లిమిటెడ్(స్పాన్సర్ బ్యాంకు) ఏఏస్ రావునగర్ శాఖ వారు సీఎస్‌ఆర్(కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) కింద ప్రభుత్వ పాఠశాలకు చేయూతనందించారు.

సంగారెడ్డి జిల్లా అందోల్ మండలం ఆక్సాన్‌పల్లి గ్రామంలోని మండల పరిషత్ ప్రైమరీ స్కూల్‌కి రూ.11.65 లక్షల విలువైన అత్యవసర విభాగానికి సంబంధించి మరుగుదొడ్లు, ఆర్‌వో వాటర్ ప్లాంటు, స్కూల్ భ వనం మొత్తానికి పెయింటింగ్ చేయించారు. పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో  ప్రధానోపాధ్యాయుడు బాల్ రాజ్‌గౌడ్, సర్పంచ్ ఎస్ మధుమతీవర్మ, కెన్ ఫిన్ జోనల్ హెడ్ లక్ష్మణ్ గుడ, బ్రాంచ్ మేనేజర్ కవితా బైరిశెట్టి,  సిబ్బంది పాల్గొన్నారు.