27 July, 2026 | 6:07 PM

Breaking News

ఐదెకరాల ప్రభుత్వ భూమి కబ్జా..   •   బీజిలిపూర్ ఎస్సీకాలనీ కరెంట్ సమస్య పరిష్కరించరా?   •   అర్హులందరికీ ఓటు హక్కు కల్పించాలి: ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   భాగీరథిపల్లిలో రూ.25 లక్షల కల్వర్టు నిర్మాణానికి భూమిపూజ   •   ఇల్లందు ఏరియాలో సింగరేణి ఉద్యోగులకు క్వార్టర్ల కౌన్సిలింగ్ నిర్వహణ   •   నేరేడుచర్లలో భాజపా ఆధ్వర్యంలో " సర్" ప్రక్రియపై సమీక్ష   •   రైతులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలి   •   ఎక్స్‌టార్షన్‌కు పాల్పడిన నిందితులు అరెస్ట్.. రిమాండ్   •   తొలిముద్ద కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ కంచర్ల హిమశ్రీ   •   ప్రభుత్వ, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కల్పించాలి   •  

షార్ట్ ఫిలిం అవార్డ్స్ ఎంట్రీలకు ఆహ్వానం

31-05-2026 01:36 AM

తెలంగాణ రాష్ట్ర 12వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘టీఎఫ్‌ఎస్‌సీ షార్ట్ ఫిలిం ఫెస్టివల్ అవార్డ్స్ 2026’ను ఆ సంస్థ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ గౌడ్ ప్రకటించారు. శనివారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన మాట్లాడారు. చిత్ర పరిశ్రమలో కొత్త ప్రతిభను ప్రోత్సహించేందుకు తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఈ పోటీలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ ఫెస్టివల్‌లో పాల్గొనేందుకు ఎలాంటి ఎంట్రీ ఫీజు లేదు.

5 నుంచి 25 నిమిషాల నిడివి గల షార్ట్ ఫిలింలను పంపవచ్చని తెలిపారు. ఎంట్రీలను జూన్ 13వ తేదీ వరకు స్వీకరిస్తామని, జ్యూరీ ఎంపిక చేసిన విజేతలకు జూన్ 21న అవార్డులు ప్రదానం చేయనున్నామని చెప్పారు. ఇక నుంచి ప్రతి ఏడాది ఈ వేడుక నిర్వహిస్తామని తెలిపారు. మొత్తం 20 విభాగాల్లో అవార్డులు అందజేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టీఎఫ్సీసీ వైస్ ఛైర్మన్లు గురురాజ్, అల్లా భక్షు, ఆర్గనైజింగ్ సెక్రటరీ అక్సాఖాన్, కోఆర్డినేషన్ కమిటీ సెక్రటరీ ప్రకాశ్‌గౌడ్ పాల్గొన్నారు.