రిస్క్ థ్రిల్ పంచుతుంది
సంపంగి, 16 వంటి చిత్రాలకు చార్ట్‌బస్టర్ మ్యూజిక్ అందించిన ఘంటాడి కృష్ణ స్వీయ సంగీత దర్శక నిర్మాణంలో రూపొందిన కొత్త సినిమా ‘రిస్క్’. సందీప్ అశ్వ, సన్యా ఠాకూర్ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ రెండో వారంలో ఈ సినిమాను రిలీజ్ చేయడానికి సన్నాహలు చేస్తున్నారు. ఈ సందర్భంగా మేకర్స్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఎమ్మెల్సీ మధుసూదనాచారి ఈ వేడుకలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో సందీప్ మాట్లాడుతూ.. “రిస్క్’ అన్నివర్గాల ప్రేక్షకులను థ్రిల్ చేసే సినిమా” అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ.. “మొదట ఈ చిత్రానికి ‘16-2’ అనే టైటిల్ అనుకున్నాం. కానీ ‘రిస్క్’ బాగుంటుందని మా హీరో సూచించారు. మ్యూజికల్‌గానూ సినిమా ప్రేక్షకులకు చేరువ అవుతుంది” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.






