క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ పథకాలకు దరఖాస్తుల ఆహ్వానం
జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి సుధీర్
వికారాబాద్ రూరల్, జులై- 21 (విజయక్రాంతి): తెలంగాణ క్రిస్టియన్ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను కుట్టు మిషన్, చిరు వ్యాపారం, ఇ - బైక్, ఇ - స్కూటీ, మోటార్ బైక్ రంగాల కోసం అర్హులైన క్రైస్తవ మైనారిటీల నుండి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి సుధీర్ మంగళవారం నాడు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుట్టు మిషన్, చిరు వ్యాపార యూనిట్లకు 21 నుండి 55 సంవత్సరాలు ఇ -బైక్, ఇ - స్కూటీ, మోటార్ బైక్ యూనిట్లకు వయసు 21 నుండి 50 సంవత్సరాల వయస్సు ఉండాలి. కుటుంబ వార్షికా దాయం పట్టణ ప్రాంతాలలో రూ. 2,00,000/- లోపు, గ్రామీణ ప్రాంతాలలో రూ. 1,50,000/- లోపు ఉండాలని తెలిపారు ఉండాలి.
అర్హులైన అభ్యర్థులు తేదీ 19-07-2026 నుండి 31-07-2026 సాయంత్రం 5 గంటల లోపు https://tgobmms.cgg.gov.in / వ్బుసైట్ ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాల కోసం దరఖాస్తుదారులు 04023391067 నంబరును సంప్రదించవచ్చని లేదా https:// tgcmfc.in / వెబ్ సైట్ ను సందర్శించాలని జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి తెలిపారు. దరఖాస్తు చేసిన నిజప్రతులను సంబంధిత జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ కార్యాలయంలో అందజేయగలరని తెలిపారు.






