30 May, 2026 | 1:35 AM

ఉపాధిహామీ కూలీలకు మజ్జిగ, ఉప్మా పంపిణీ

30-05-2026 12:09 AM

రుద్రంగి మే 29 (విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలకేంద్రంలోని 200ల మంది ఉపాధిహామీ కూలీలకు స్థానిక సర్పంచ్ గండి నారాయణ మజ్జిగ ప్యాకెట్లు అల్పాహారం ఉక్మ అందజేసి మా టు కాలువ పనులను పరిశీలించారు.

ఈ సం దర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. గత పది సంవత్సరాలుగా మరమ్మతులకు నోచుకోని నాగరం చెరువు బతుకమ్మ కుంట చెరువు మాటు కాలువను స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చొరవతో మరమ్మతులు చేపట్టడం జరిగిందని అన్నారు.అలాగే రైతు ల కోరిక మేరకు మాటు కాలువ మత్తడి చెక్ డ్యాం మరమ్మతులు కోసం ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ 16 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు.

మాటు కాలువ పనులు పూర్తి అయితే బతుకమ్మ కుంట నిత్యం నీటితో ఉంటుందని గ్రహించిన ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో మాటు కాలువ పనులు ప్రారంభించడం జరిగిందని అన్నారు.రానున్న వర్ష కాలంలో నాగరం చెరువు తూము నుండి మాటు కాలువ ద్వారా బతుకమ్మ చెరువులోకి నీరు వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు ఎర్రం గంగానర్సయ్య, ఆలయ చైర్మన్ సామ మోహన్ రెడ్డి, మాజీ జడ్పిటిసి గట్ల మీనయ్య, గడ్డం శ్రీనివాస్, తర్రె లింగం, పుట్కపు మహిపాల్, పల్లికొండ వినయ్ పాల్గొన్నారు.