30 May, 2026 | 2:07 AM

రాబోయేది బీజేపీ ప్రభుత్వమే..

30-05-2026 12:11 AM

ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్

ముషీరాబాద్, మే 29 (విజయక్రాంతి):  తెలంగాణలో రాబోయేది బీజేపీ ప్రభుత్వ మేనని  ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ పేర్కొన్నారు. శుక్రవారం ఎంపీ డాక్టర్ కె. లక్ష్మణ్ రాజ్యసభ హౌస్ కమిటీ చైర్మన్ గా అత్యున్నత పదవిలో నియమితులైన సందర్భంగా బాకారం, భోలక్ పూర్ కు చెందిన బీజేపీ రాష్ట్ర నాయకుడు బిజ్జి కనకేష్ కుమార్, రాజశేఖర్ ఆధ్వర్యంలో లక్ష్మణ్ ను కలిసి సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోదీ సారధ్యంలో దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా బీజేపీ అధికార పగ్గాలు చేపడుతున్నదని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రజలు బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారని పేర్కొన్నారు. త్వరలో జరగనున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ అభ్యర్థులు భారీ మెజార్టీతో గెలవడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోదీ చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలమైన శక్తిగా మార్చే విధంగా అంకిత భావంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మహాంకాళి జిల్లా ప్రధాన కార్యదర్శి రమేష్రమ్, రాష్ట్ర నాయకులు నందగిరి నర్సింహా, సదానంద్ ముదిరాజ్, జమాల్ పూరి నందు, నియోజకవర్గం బీజేపీ జాయింట్ కన్వీనర్ మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.