23 June, 2026 | 6:05 PM

ఎస్ఆర్ఆర్ లో బీకాం విద్యార్థులకు ఏఐ, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ

23-06-2026 04:59 PM

ముకరంపుర,(విజయ క్రాంతి):  తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న 'అన్న అక్క మెంటార్షిప్' టీచింగ్ ఇంటర్న్షిప్  ప్రోగ్రాం లో భాగంగా స్థానిక ఎస్ ఆర్ ఆర్ ప్రభుత్వ అటనామస్ కళాశాలలో నాలుగు రోజుల శిక్షణ కార్యక్రమంలో భాగంగా మొదటి రోజున బీకాం విద్యార్థులకు 'ఏఐ, డిజిటల్ లెర్నింగ్' పై శిక్షణ ఇచ్చారు. మొదటి రోజు శిక్షణ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కల్వకుంట రామకృష్ణ మాట్లాడుతూ... కార్యక్రమంలో భాగంగా మొదటి రోజు బీకాం కంప్యూటర్ అప్లికేషన్స్ ఐదవ సెమిస్టర్ విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, డిజిటల్ లెర్నింగ్ పై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు.

శిక్షకులుగా కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ అప్లికేషన్స్ విభాగ అధ్యాపకులు జడల రమేష్, ప్రేమ్ చంద్, చౌదరి, వేములవాడ శ్రీనివాస్ మహేందర్ లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ అండ్ అప్లికేషన్స్, కోడింగ్,  పైతాన్ లాంగ్వేజ్,  డిజిటల్ లర్నింగ్, కంప్యూటేషనల్ థింకింగ్, ఎమర్జింగ్ టెక్నాలజీస్, టెక్నాలజీని సురక్షితంగా, బాధ్యతాయుతంగా వినియోగించడం తదితర అంశాలపై శిక్షణ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ పి నితిన్, కామర్స్ విభాగాధిపతి టి రాజయ్య ,డాక్టర్ ఎం మల్లారెడ్డి  అధ్యాపకులు ,మరియు  విద్యార్థులు పాల్గొన్నారు.