రైతు బీమాపైన ప్రభుత్వం స్పష్టతనివ్వాలి
బోథ్,(విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిలిపివేసిన రైతు బీమాపైన స్పష్టతనివ్వాలని జిల్లా రైతు స్వరాజ్య వేదిక అధ్యక్షులు సంగేపుబోర్ర న్న. ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆగస్టు 14 అర్ధరాత్రి నుండి రైతు బీమాకు చెల్లించాల్సిన డబ్బులను ప్రభుత్వం చెల్లించకపోవడంతో జిల్లాలో ఇప్పటివరకు చనిపోయిన 30 మంది రైతులకు రావాల్సిన భీమా పరిహారం అందకుండా ఉంటుందని ఆవేదన వ్యక్తపరిచారు.
ప్రభుత్వం రైతు బీమా విషయంలో స్పష్టతనివ్వాలని డిమాండ్ చేశారు. దేశానికి వెన్నుముక ఆయన రైతును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో ప్రభుత్వాలు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి ఉంటుందన్నారు. రైతుల అకాల మరణంతో రైతుల కుటుంబాలు చిన్న భిన్నంగా మారుతున్న అన్నారు. మృతి చెందిన రైతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రైతులు భీమ్రావు, భూమన్న ,రవి ,సంజీవ్ ,రమేష్, ఇంధల్ అరవింద్ తదితరులు ఉన్నారు.






