26 August, 2026 | 1:27 AM

మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలను సందర్శించిన మున్సిపల్ చైర్‌పర్సన్

25-08-2026 10:43 PM

ఆదిలాబాద్,(విజయక్రాంతి): ఆదిలాబాద్ పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ కళాశాలలో మధ్యాహ్న భోజనాన్ని మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష, డీఎండబ్ల్యూ ఖలీంతో కలిసి పరిశీలించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేస్తూ భోజనం నాణ్యత, రుచిని స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్‌పర్సన్ బండారి అనూష మాట్లాడుతూ... రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు అన్ని విధాలా అవసరమైన సదుపాయాలు కల్పిస్తోందని, ముఖ్యంగా విద్యార్థులకు అందించే భోజన నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకూడదని సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన, పరిశుభ్రమైన ఆహారం అందేలా అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని డీఎండబ్ల్యూ ఖలీంను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డీఎండబ్ల్యూ ఖలీం, కళాశాల ప్రిన్సిపల్, అధ్యాపకులు, విద్యార్థులు, మున్సిపల్ శానిటేషన్ ఎస్‌ఐ శంకర్, నారాయణరెడ్డి, ఎన్విరాన్‌మెంట్ ఇంజనీర్ అవికిరణ్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.