ఐదో వార్డులో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ
25-08-2026 10:41 PM
ఆసిఫాబాద్(విజయక్రాంతి): ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఐదో వార్డులో కౌన్సిలర్ కోదండవార్ స్వప్న రాణి లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను అందజేశారు.ఈ సందర్భంగా కౌన్సిలర్ స్వప్న రాణి మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేస్తామని తెలిపారు. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు మరింత సులభంగా అందే అవకాశం ఉందన్నారు. వార్డు ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతో పాటు, ప్రభుత్వ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా నిరంతరం ప్రజలతో కలిసి పనిచేస్తానని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వార్డు ప్రజలు, లబ్ధిదారులు, సంబంధిత అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.






