24 August, 2026 | 11:02 PM

గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోంది

24-08-2026 09:36 PM

- రూ.2.89 కోట్లతో రోడ్డు పనులు ప్రారంభం 

లక్షెట్టిపేట: గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి పని చేస్తోందని కొత్త కొమ్ముగూడెం సర్పంచ్ సందెల సుజాత అన్నారు. సోమవారం మండలంలోని కొత్త కొమ్ముగూడెం నుంచి దౌడపల్లి వరకు సుమారు రూ 2.89 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించనున్న బీటీ, సిమెంట్ రోడ్డు నిర్మాణ పనులను మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ, ఆర్టీఏ మెంబర్ అంకతి శ్రీనివాస్ లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ రోడ్డు నిర్మాణంతో కొత్త కొమ్ముగూడెం, దౌడపల్లి గ్రామాల ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం అవుతాయన్నారు.

గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి రోడ్లు ఎంతో కీలకమని, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మంచిర్యాల నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామాన్ని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. అనంతరం డీసీసీ మాజీ అధ్యక్షురాలు సురేఖను శాలువాతో సర్పంచ్ దంపతులు సందేల సుజాత, సురేష్ లు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు, సర్పంచ్ నలిమెల రాజు, పట్టణ అధ్యక్షులు సయ్యద్ షాహిద్ అలీ, జిల్లా ఆర్జీపీఆర్ఎస్ అధ్యక్షులు గడ్డం త్రిమూర్తి, మండల వైస్ ప్రెసిడెంట్ కందుల మోహన్, జిల్లా నాయకులు పూర్ణచంద్రరావు, బియ్యాల తిరుపతి, మండల మాజీ అధ్యక్షులు పింగిలి రమేష్,  మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు, ఉప సర్పంచ్ బొప్పు సుమన్ , కౌన్సిలర్లు, సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు, మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.