అంకితభావానికి నిలువుటద్దం బుచ్చమ్మ టీచర్
కడ్తాల్, ఫిబ్రవరి 25( విజయక్రాంతి): స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో సాంఘిక శాస్త్రం ఉపాధ్యాయురాలిగా సేవలందించిన ఉపాధ్యాయురాలు బుచ్చమ్మ బుధవారం ఉద్యోగ విరమణ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన ఆత్మీయ వీడ్కోలు సభలో ఆమెను ఘనంగా సన్మానించారు. వేడుకలో భాగంగా మాజీ సర్పంచ్ లక్ష్మీ నర్సింహ్మ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, బుచ్చమ్మ గారిని శాలువాతో సత్కరించి అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాబోధనలో ఆమె చూపిన క్రమశిక్షణ, విద్యార్థుల పట్ల ఉన్న ప్రేమ ఎందరికో స్ఫూర్తిదాయకమని వక్తలు కొనియాడారు. ఉద్యోగ విరమణ కేవలం వృత్తిపరమైనదే కానీ విద్యార్థుల పట్ల అమ్ముకున్న అనురాగం ఎప్పటికీ నిలిచి ఉంటుందని పలువురు కొనియాడారు. కార్యక్రమంలో జిహెచ్‌ఎం జంగయ్య, ఉపాధ్యాయ సంఘం నేత గోపాల్ నాయక్, ఉపాధ్యాయులు రాధాకృష్ణ రెడ్డి, మల్లయ్య, ధనుంజయ గౌడ్, ఇతర ఉపాధ్యాయ బృందం, గ్రామస్తులు మరియు విద్యార్థులు పాల్గొని ఆమెకు శుభాకాంక్షలు తెలిపారు.




