25 April, 2026 | 2:49 PM

ఒరిజినల్ ఎప్పటికీ ఒరిజినలే..! కవిత పార్టీపై బీఆర్ఎస్ రియాక్షన్

25-04-2026 12:59 PM

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (Telangana Rashtra Sena) నుండి భారత రాష్ట్ర సమితి (Bharat Rashtra Samithi )గా పేరు మార్చబడిన పార్టీ అసలు గుర్తింపును ప్రతిబింబిస్తూ, కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేన' (TRS) అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. తన రాజకీయ పార్టీకి టీఆర్ఎస్ అని పేరు పెట్టడం ద్వారా, తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ సైద్ధాంతిక వారసత్వాన్ని తిరిగి పొందేందుకు చేస్తున్న ఒక ప్రతీకాత్మక ప్రయత్నంగా కవిత గుర్తింపు పొందాలని కోరుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. కవిత కొత్త పార్టీ ఆవిర్భావ సభలో మాట్లాడుతూ.. మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. కవిత వ్యాఖ్యలు, కొత్త పార్టీ TRS పై బీఆర్ఎస్ స్పందించింది. 'ఒరిజినల్‌ ఎప్పటికీ ఒరిజినలే' అంటూ కోల్గేట్, బిస్లరీల ఒరిజినల్‌, నకిలీల ఫొటోలతో బీఆర్ఎస్‌ ఆఫీషియల్ ఎక్స్‌లో పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.