27 April, 2026 | 8:51 PM

మల్లాపూర్ మండలంలో బీఆర్‌ఎస్ రజతోత్సవ వేడుకలు

27-04-2026 06:24 PM

మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండల కేంద్రంతో పాటు మొగిలిపేట, వెంపెల్లి వెంకట్రావుపేట, ముత్యంపేట, సంగెం శ్రీరాంపూర్, రేగుంట, ఓబుళపూర్, రాఘవపేట తదితర గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ రజతోత్సవ వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. పార్టీ ఆవిర్భవించి ఇరవై ఐదు ఏళ్లు పూర్తయిన సందర్భంగా సంబరాలు పండుగ వాతావరణంలో చేపట్టారు.గ్రామల్లో బీఆర్‌ఎస్ జెండా గద్దె వద్దనాయకులు, కార్యకర్తలు గులాబీ జెండాను ఎగురవేసి పార్టీ వ్యవస్థాపకుడు చంద్ర శేఖర్ రావు నాయకత్వానికి జేజేలు పలికారు.

అనంతరం కార్యకర్తలు, నాయకులు, గ్రామ ప్రజలకు స్వీట్లు పంపిణీ చేసి సంబరాలను చేసుకున్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ అస్థిత్వం కోసం పుట్టిన బీఆర్‌ఎస్ పార్టీ నేడు రజతోత్సవం జరుపుకోవడం ప్రతి కార్యకర్తకు గర్వకారణమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు అందరూ ఐక్యంగా పనిచేస్తామని ప్రతిజ్ఞ చేశారు.కార్యక్రమంలో పాల్గొన్న పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలకు నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు.