ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ను అభినందించిన ఎమ్మెల్యే
10-04-2026 06:53 PM
మణుగూరు,(విజయక్రాంతి): ఏరియా వంద పడకల ఆసుపత్రి సూప రింటెండెంట్ డాక్టర్ ముత్తినేని గౌరీ ప్రసాద్ ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. శుక్రవారం గౌరీ ప్రసాద్ క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యేను మర్యాద పూర్వకంగా కలిశారు. ఏరియా ప్రభుత్వ దవాఖానలో ప్రజలకు నాణ్య మైన, సమయోచిత వైద్య సేవలు
అందించడంలో చూపిన చొరవకు ఆసుపత్రి సూపరింటెండెంట్ గౌరీ ప్రసాద్ ను వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ చేతుల మీదుగా ఉత్తమ సేవా అవార్డు లభించింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆయనను అభినందిస్తూ, భవిష్యత్తులో మరెన్నో సేవలు ప్రజలకు అందించాలని ఆకాంక్షించారు. సహచర వైద్యులు, సిబ్బంది, ప్రజలు డాక్టర్ గౌరీ ప్రసాద్ కు అభినందనలు తెలిపారు.




