రైతుల పట్ల రేవంత్ రెడ్డి రాక్షసుడు
మున్ముందు మరింత కరువు
సిద్దిపేట: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి( CM Revanth Reddy) రైతలు పట్ల రాక్షసుడిగా మారిపోయారని కాళేశ్వరం జలాల కోసం అన్నపూర్ణ సాగర్ నుండి రంగనాయక సాగర్ వరకు పాదయాత్ర కార్యక్రమంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు(BRS MLA Harish Rao) అన్నారు. రైతుబంధు బంద్ అయింది, సాకుకు కరెంట్ ఇవ్వట్లేదు, యూరియా లేదు, ప్రాజెక్టుల నుంచి నీటి విడుదల లేదని ఆరోపించారు. మున్ముందు మరింత కరువు వస్తుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారని హరీశ్ రావు పేర్కొన్నారు.
గోదావరిలో వరద పోతుంటే.. నీళ్లు ఎత్తిపోయట్లేదని హరీశ్ రావు ఆగ్రహించారు. స్కామ్ ల కాంగ్రెస్ పోయి.. స్కీమ్ ల కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) రావాలని ప్రజలు కోరుకుంటున్నారని ఆయన సూచించారు. రేవంత్ రెడ్డి వచ్చి మళ్లీ పాతరోజులు తీసుకువచ్చారని మాజీ మంత్రి స్పష్టం చేశారు. మేడిగడ్డ నుంచి నీళ్లు ఎత్తిపోయమంటే.. భద్రాచలం మునుగుతుందని అంటున్నారని విమర్శించారు.






