20న జగిత్యాలలో కేసీఆర్ సభ... జీవన్ రెడ్డి చేరిక — బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం
హైదరాబాద్: జగిత్యాల జిల్లా కేంద్రంలో ఈ నెల 20వ తేదీన నిర్వహించనున్న మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(Kalvakuntla Chandrashekar Rao) బహిరంగ సభకు సంబంధించి మోతె రోడ్డు పక్కన గల స్థలాన్ని మాజీ మంత్రులు కొప్పుల ఈశ్వర్, జీవన్ రెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, ఎమ్మెల్సీ ఎల్. రమణ పరిశీలించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్(Former Minister Koppula Eshwar) మాట్లాడుతూ… రెండేళ్లలోనే రాష్ట్రం అస్తవ్యస్తంగా మారిందని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలలో ఒక్కటినీ కూడా నెరవేర్చలేదని ఆరోపించారు.
జగిత్యాల సభతో ప్రభుత్వానికి కనువిప్పు కలిగిస్తామని తెలిపారు. జీవన్ రెడ్డి చేరికతో ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత బలం చేకూరిందని పేర్కొన్నారు. జగిత్యాల సభను భారీగా నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరవుతారని, లక్ష మందితో సభ నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల, మాజీ జెడ్పీ చైర్మన్ దావ వసంత సురేశ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా మాజీ జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, లోక బాపురెడ్డి, పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.




