4 June, 2026 | 11:20 PM

ముంపు సమస్యపై పోలవరం అథారిటీ బృందం పారదర్శకంగా సర్వే చేయాలి

04-06-2026 05:46 PM

పీపీఏ బృందానికి మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు లేఖ అందజేసిన బీఆర్ఎస్ నేతలు

బూర్గంపాడు,జూన్ 4(విజయక్రాంతి): పోలవరం బ్యాక్ వాటర్ ముంపు ప్రభావంతో భద్రాచలం ఏజన్సీతో పాటు బూర్గంపాడు, అశ్వాపురం మండలాల ప్రజలు లక్షలాది మందికి తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని…ముంపు సమస్యకు సంబంధించి పోలవరం ప్రాజెక్టు అథారిటీ బృందం(పీపీఏ) రెండు రోజులుగా వరద ప్రభావిత ప్రాంతాల్లో నిర్వహిస్తున్న ముంపు సర్వేను పారదర్శకంగా నిర్వహించాలని రాష్ట్ర మాజీ మంత్రి, బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు భద్రాద్రి కొత్తగూడెం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు నేతృత్వంలో భద్రాచలం, బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు బీఆర్ఎస్ నేతలతో కలిసి గురువారం సారపాక ఇటీసీ అతిథిగృహంలో బృందం సభ్యులకు లేఖ (వినతిపత్రం) అందజేశారు. పోలవరం రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ప్రభావం కారణంగా భద్రాచలం, బూర్గంపహాడ్ మండలాల్లో పలు ప్రాంతాలు, పారిశ్రామిక ప్రాంతమైన సారపాక, ఐటీసీ పేపర్ బోర్డు, స్పెషాలిటీ పేపర్స్ డివిజన్(5 వేల కుటుంబాలకు ఆధారం), అశ్వాపురంలోని హెవీ వాటర్ ప్లాంట్, దుమ్ముగూడెంలో హైడల్ ప్రాజెక్టు, పరిసర గ్రామాలు, నివాస ప్రాంతాలు తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉందన్నారు.

పీపీఏ బృందానికి లేఖను అందించిన వారిలో భద్రాచలం ఇన్చార్జ్ మానే రామకృష్ణ, కోటగిరి ప్రబోద్‌కుమార్‌, రేపాక పూర్ణచందర్‌రావు, బూర్గంపాడు నుంచి మండల అధ్యక్షుడు గోపిరెడ్డి రమణారెడ్డి, సొసైటీ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరిపల్లి వంశీకృష్ణ, మాజీ సర్పంచ్ సిరిపురం స్వప్న, బొల్లు సాంబ, పాటి అశోక్, మేడిగం లక్ష్మినారాయణరెడ్డి, కృష్ణ, శ్రీను, అశ్వాపురం నుంచి మండల అధ్యక్షుడు కోడి అమరేందర్, సూదిరెడ్డి గోపిరెడ్డి, వెన్న అశోరకుమార్, శివారపు డాక్టర్ బాబు, మణుగూరు నుంచి మండల అధ్యక్షుడు, సొసైటీ చైర్మన్ కుర్రి నాగేశ్వరరావు, యాదగిరి గౌడ్లతో పాటు నాలుగు మండలాలకు చెందిన నాయకులు పెద్దసంఖ్యలో ఉన్నారు.