4 June, 2026 | 11:18 PM

పదవీ విరమణ పొందిన హోంగార్డ్ లను సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు

04-06-2026 05:44 PM

కొత్తగూడెం జూన్ 4 విజయక్రాంతి: హోంగార్డ్ ఆర్గనైజేషన్లో ఎన్నో ఏళ్లుగా పనిచేస్తూ ఎనలేని సేవలందించి  పదవీ విరమణ పొందిన ఇద్దరు హోంగార్డులను, గురువారం రోజున, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు,  కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు ఘనంగా సత్కరించారు.24 సంవత్సరాలు హోంగార్డ్ ఆర్గనైజేషన్ లో తమ సేవలను అందించిన, ఇరువురు  పి.నరసింహారావు, మహిళ హోంగార్డు  ఆర్. రాంబాయి,  పదవీ విరమణ పొందడం జరిగింది. ఇద్దరు హోంగార్డ్ లను జిల్లా ఎస్పీ  శాలువాలతో, పూలమాలతో ఘనంగా సత్కరించారు. వీరి అనుభవాలను జిల్లా ఎస్పీతో పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పదవీ విరమణ పొందిన హోంగార్డు సిబ్బంది తమ శేషజీవితాన్ని  కుటుంబ సభ్యులతో కలసి, ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. పదవీ విరమణ పొందిన హోంగార్డు సిబ్బందికి ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.తమ దైనందిన కార్యక్రమాలలో వ్యాయామం,యోగా,ధ్యానం వంటి వాటిని అనుసరిస్తూ తమ ఆరోగ్యాల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పి సత్యనారాయణ, ఎస్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్,  హోంగార్డ్ ఆర్గనైజేషన్ రిజర్వ్ ఇన్స్పెక్టర్ నరసింహారావు, సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.