గుండెపోటుతో బీఆర్‌ఎస్ నేత మృతి
నివాళులు అర్పించిన మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్
ఖమ్మం, ఆగస్టు 25(విజయక్రాంతి): బీఆర్‌ఎస్ ఖమ్మం జిల్లా మైనారిటీ అధ్యక్షులు మహమ్మద్ తాజుద్దీన్ సోమవారం రాత్రి గుండెపోటుతో మృతి చెందారు. ఖమ్మం లో నివాసం ఉంటున్న తాజుద్దీన్ సడెన్ గా వచ్చిన గుండెపోటుతో తన నివాసంలో మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సంతాపం ప్రకటించారు..
నివాళ్ళు అర్పించిన మాజీ మంత్రి
తాజుద్దీన్ మృతి చెందారనే విషయం తెలుసుకున్న మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఆయన కుమారుడు నయన్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు. పార్టీకి ఆయన కుటుంబానికి తీరని లోటని తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేసారు. ఆయన చేసిన సేవలు గుర్తుచేసుకున్నారు. వారి కుటుంబానికి పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
వారి ఆత్మకు శాంతి చేకూరాలని దేవుణ్ణి ప్రార్ధించారు. కార్యక్రమంలో నాయకులు పగడాల నాగరాజు, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, ఖమర్, భీరెడ్డి నాగచంద్ర రెడ్డి, కర్నాటి కృష్ణ, బచ్చు విజయ్ కుమార్, షేక్ మక్బుల్,బత్తుల మురళి, కూరాకుల వలరాజు, నాగండ్ల కోటేశ్వరరావు, వీరునాయక్,పిన్ని. షేక్ తాజుద్దీన్ 24 వ డివిజన్. కోటేశ్వరరావు, ముజాహిద్,తౌసిఫ్ తదితరులు పాల్గొన్నారు






