౩౦న బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం
ముషీరాబాద్, మే 25 (విజయక్రాంతి): ముషీరాబాద్‌లోని కశిష్ హాల్లో ఈ నెల 30 న జరిగే బీఆర్‌ఎస్ ముషీరాబాద్ నియోజకవర్గం విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశా న్ని విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ యువ నాయకుడు ముఠా జైసింహ కార్యకర్తలకు, నాయకులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం ముషీరాబాద్‌లోని భారత్ సేవా సమాజ్ కమ్యూనిటి హాల్లో బీఆర్‌ఎస్ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం జరిగింది.
ముఖ్య అతిథిగా హాజరైన ముఠా జైసింహ మాట్లాడు తూ.. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఎమ్మెల్యే ముఠా గోపాల్, నగర ఇన్చార్జి తలసాని శ్రీనివాస్ యాదవ్, నియోజకవర్గం సభ్యత్వ నమోదు ఇన్చార్జి వెంకట్ రెడ్డిలు హాజరవుతారని తెలిపారు. ఈ సమావేశంలో బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు ఎడ్ల హరిబాబు యాదవ్ తో పాటు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.






