27 April, 2026 | 8:51 PM

ఘనంగా బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.

27-04-2026 06:54 PM

రాజాపూర్: రాజాపూర్ మండల ముఖ్య కూడలిలో సోమవారం బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. చౌరస్తాలో పార్టీ మండల అధ్యక్షులు మేకల శ్రీశైలం యాదవ్ బీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై విరక్తి చెందుతున్నారని,  రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం ఖాయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నర్సింలు,  పార్టీ నాయకులు, కార్యకర్తలు, పాల్గొన్నారు.