4 July, 2026 | 9:54 PM

Breaking News

అనురాగ్ వార్షిక స్నాతకోత్సవంలో 2,789 మంది విద్యార్థులకు పట్టాలు ప్రదానం   •   హ్యూమన్‌ రైట్స్‌ ఫౌండేషన్‌ రాష్ట్ర కోఆర్డినేటర్ గా సాయి భాను   •   డ్రగ్స్, సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన   •   వేములవాడ నాయీ బ్రాహ్మణ అసోసియేషన్‌ నూతన కమిటీ   •   పేరం వెంకటేశ్వర రావుకి ఘన సన్మానం   •   నీటి సంపులో పడి చిన్నారి మృతి   •   సీఐ కరుణాకర్ కు జన్మదిన శుభాకాంక్షలు   •   కొత్త మోడల్ మార్కెట్‌లో మహిళా వ్యాపారుల కన్నీరు   •   దొడ్డి కొమరయ్య త్యాగం అందరికీ స్ఫూర్తిదాయకం   •   లయన్స్ క్లబ్ నేరేడుచర్ల ఆధ్వర్యంలో పింగళి వెంకయ్య వర్ధంతి, అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలు   •  

ఘనంగా బీఆర్‌ఎస్ ఆవిర్భావ వేడుకలు

28-04-2026 12:22 AM

రామచంద్రపురం, ఏప్రిల్ 27 :  బీఆర్‌ఎస్ పార్టీ 26వ ఆవిర్భావ దినోత్సవాన్ని రామచంద్రపురంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ ఇన్చార్జ్  ఆదర్శ్ రెడ్డి  పాల్గొన్నారు. భారతీనగర్ డివిజన్లోని  బస్ స్టాప్, రామచంద్రాపురం బాలవిహార్ పార్క్ సమీపంలో పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ్ రెడ్డి  మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో చారిత్రాత్మక పాత్ర పోషించిన బీఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర అభివృద్ధి దిశగా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ప్రజల విశ్వాసాన్ని పొందిందన్నారు.

రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు, గ్రామీణాభివృద్ధి, మౌలిక వసతుల విస్తరణ, విద్య, వైద్య రంగాల్లో సంస్కరణలు తీసుకువచ్చి రాష్ట్రాన్ని దేశంలో అగ్రగామిగా నిలిపిందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య ,ఆలూరి గోవింద్ ,పరమేష్ యాదవ్, నవీన్ బూన్, తొంట కృష్ణకాంత్, ఐలేష్, క్రాంతి, బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, యువకులు పాల్గొన్నారు.