నేడు ఈఆర్‌సీ ముందుకు బీఆర్‌ఎస్
- ‘రైతు డిస్కం’పై వాదనలు వినిపించనున్న ప్రతినిధుల బృందం
- హాజరుకానున్న కేటీఆర్, జగదీష్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి తదితరులు
హైదరాబాద్, మే 28 (విజయక్రాంతి) : కాంగ్రెస్ ప్రభుత్వం ‘రైతు డిస్కం’ పేరుతో చేపట్టిన చర్యలను, ఆ నిర్ణయం వెనుక ఉన్న కుట్రలను ప్రజల ముందు ఉంచేందుకు బీఆర్‌ఎస్ సిద్ధమైంది. శుక్రవారం ఉదయం 10 గంటలకు ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్‌సీ) ముందు జరగనున్న ప్రజాభిప్రాయ సేకరణలో తెలంగాణ రైతాంగం, ప్ర జల పక్షాన బీఆర్‌ఎస్ పార్టీ తన గళం వినిపించనుంది. ప్రజాభిప్రాయ సేకరణకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో బీఆర్‌ఎస్ ప్రతినిధుల బృందం హాజరుకానుంది.
ఈ బృందంలో మంత్రులు గుంట కండ్ల జగదీష్‌రెడ్డి, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డితో పాటు ఇతర సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు ఉంటారు. ‘రైతు డిస్కం’ ప్రతిపాద నల వల్ల రైతాంగానికి, రాష్ట్ర విద్యుత్ రంగానికి వాటిల్లే నష్టాలను, ప్రభుత్వ వైఖరిని కమిషన్ దృష్టికి తీసుకెళ్లనున్నారు.






