7 July, 2026 | 2:39 AM

సుప్రభాత్ కాలనీ సమస్యలు పరిష్కరించాలి

07-07-2026 01:50 AM

ఘట్ కేసర్, జూలై 6 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్, పోచారం డివిజన్, కాచవాని సింగారంలోని సుప్రభాత్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాలనీవాసులు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్యతో పాటు ఆటస్థలాల సుందరీకరణ అంశాలపై సోమవారం మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డికి వినతిపత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి సుప్రభాత్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కమిటీ సభ్యులతో కలిసి మేడ్చల్ నియోజకవర్గం బీజేపీ ఇన్చార్జ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి కమిషనర్ను కలిసి కాలనీలో నెలకొన్న తాగునీటి కొరతను వెంటనే పరిష్కరించాలని, అలాగే స్థానిక ఆటస్థలాలను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు.

వినతిని స్వీకరించిన కమిషనర్ వినయ్ కృష్ణా రెడ్డి సంబంధిత అధికారులను వెంటనే పిలిచి, తాగునీటి సమస్య, ఆటస్థలాల అభివృద్ధిపై క్షేత్రస్థాయిలో సమగ్రంగా పరిశీలించి త్వరితగతిన నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక అందిన వెంటనే సుప్రభాత్ కాలనీకి తాగునీటి సరఫరా మెరుగుపరిచే పనులను ప్రారంభించడంతో పాటు ఆటస్థలాల సుందరీకరణ పనులను కూడా త్వరలో చేపడతామని కమిషనర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కాలనీవాసులు తమ సమస్యలపై సానుకూలంగా స్పందించిన కమిషనర్కు, అలాగే సమస్య పరిష్కారానికి చొరవ చూపిన బీజేపీ మేడ్చల్ నియోజకవర్గం ఇన్చార్జ్ ఏనుగు సుదర్శన్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.