2 June, 2026 | 7:13 PM

Breaking News

కోటమ్మ తల్లి దేవత వార్షికోత్సవ పత్రిక ఆవిష్కరించిన సర్పంచ్ వినోద్   •   బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రెస్‌లోకి భారీగా చేరికలు   •   సాలూర ఎమ్మార్వో కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు   •   జాతీయస్థాయి పోటీలకు ఎంపికవ్వడం అభినందనీయం   •   సెయింట్ పాల్స్ నందు ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు   •   4 వార్డ్ లో నూతన ఇందిరమ్మ గృహన్ని ప్రారంభించిన కౌన్సిలర్   •   బ్రిలియంట్‌లో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు   •   మున్సిపల్ కో ఆప్షన్ మెంబర్ ను సన్మానించిన ఆసుపత్రి సూపరిండెంట్ విజయ్ భాస్కర్   •   అగ్నివీర్ వాయు విభాగానికి ఎంపికైన యువతులు జిల్లాకు గర్వకారణం   •   విద్యుత్తు పనుల్లో మృతి చెందిన లేబర్ కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి   •  

కాగజ్‌నగర్ సభలో ఎమ్మెల్యేకు ప్రోటోకాల్ అంశంపై బీఆర్ఎస్ ఆరోపణలు

02-06-2026 06:02 PM

జైనూర్,(విజయక్రాంతి): కాగజ్‌నగర్‌లో జరిగిన ప్రభుత్వ సభలో స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మికి ప్రోటోకాల్ కల్పించలేదని, మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ప్రభుత్వ కార్యక్రమాన్ని కాంగ్రెస్ రాజకీయ సభగా మార్చి, ప్రజలు ఎన్నుకున్న ఆదివాసీ మహిళా ఎమ్మెల్యేను వేదికపై అవమానించారని వారు విమర్శించారు. నియోజకవర్గ సమస్యలు ముఖ్యమంత్రి ముందు ప్రస్తావించే అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఎన్నికల హామీల అమలులో ప్రభుత్వం విఫలమైందని, హామీలపై ప్రశ్నలు వస్తాయనే భయంతోనే ఎమ్మెల్యేకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం అంటే ఆదివాసీ సమాజాన్ని అవమానించడమేనని వారు వ్యాఖ్యానించారు.